India bloc protest against Gyanesh Kumar 
తెలంగాణ

జ్ఞానేశ్‌ను భర్తరఫ్ చేసి, అరెస్ట్ చేయాలి

Sai kiran
  • సర్ ప్రక్రియపై ఇండియా కూటమి ఆగ్రహం

  • బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్

  • ఓటు బచావో.. దేశ్ బచావో నినాదంతో ర్యాలీలు

ప్రభాత ఉదయం :  సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఇండియా కూటమి నాయకులు డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు చేశారు. ఇండియా కూటమి పిలుపు మేరకు మంగళవారం నారాయణపేట జిల్లాలోని నర్సిరెడ్డి చౌరస్తాలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీల ఆధ్వర్యంలో “ఓటు బచావో.. దేశ్ బచావో” నినాదంతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. కానీ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు.

బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలి

సర్ ప్రక్రియ రద్దు చేసి, బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ ఫిక్సింగ్ చేసుకుందని, అందుకే సర్ ప్రక్రియపై మాట్లాడడం లేదంటూ విమర్శలు చేశారు.

జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

మేడ్చల్ కలెక్టరేట్ వద్ద అఖిలపక్షం అధ్వర్యంలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను ఇండియా కూటమి నాయకులు దహనం చేసి, ర్యాలీ తీశారు.

మోదీ, అమిత్ షా ఒత్తిడితో రాజ్యాంగానికి ద్రోహం

మోదీ, అమిత్ షా ఒత్తిడికి జ్ఞానేశ్ కుమార్ తలొగ్గాడని డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, సీపీఐ నాయకులు మల్లేష్ విమర్శలు చేశారు. జ్ఞానేశ్‌ను అరెస్ట్ చేసే వరకు పోరాటం ఆగదన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు.