ప్రభాత ఉదయం, ఉట్నూర్: మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంద్రవెల్లి ఎస్సై సాయన్న హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జరిగిన ఘటనపై కొందరు సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన ఇరువర్గాలపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు. తప్పుడు ప్రచారాలు, వదంతులకు దూరంగా ఉండాలని కోరారు. శాంతి సామరస్యాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజలకు సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు.