తెలంగాణ

ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. దేశవ్యాప్తంగా 24 చోట్ల సోదాలు!

ముఖ కాన్సర్ నెట్ వర్క్ ఒమేగా హాస్పిటల్స్‌లో శుక్రవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా 24 చోట్ల తనిఖీలు చేపట్టినట్లుగా సమాచారం.

Phaneendra

 ప్రభాత ఉదయం, హైదరాబాద్ :  ప్రముఖ కాన్సర్ నెట్ వర్క్ ఒమేగా హాస్పిటల్స్‌లో శుక్రవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా 24 చోట్ల తనిఖీలు చేపట్టినట్లుగా  సమాచారం. హైదరాబాద్ ఇన్వేస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్‌లలోని ఒమేగా హాస్పిటల్స్ ప్రధాన శాఖలు, కార్పొరేట్ కార్యాలయాలపై సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత, భారీ నగదు లావాదేవీల ఆరోపణల నేపథ్యంలోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఒమేగా హాస్పిటల్స్ యాజమాన్యం, కీలక డైరెక్టర్ల ఆర్థిక మూలాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

భారీ ఎత్తున పన్ను ఎగవేత ఆరోపణలు, లెక్కల్లో చూపని ఆదాయం నేపథ్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హాస్పిటల్స్‌లో పని చేస్తున్న డాక్టర్లు, సంబంధిత కీలక వ్యక్తుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల సందర్భంగా కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, ఆర్థిక లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలకు సంబంధించి ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన  వెలువడాల్సి ఉంది.