Kagaznagar Sub-Collector Harsh Choudhary issued orders for the release of water to drying paddy crops 
తెలంగాణ

మొనగాడు సబ్ కలెక్టర్!

సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఫిర్యాదు చేయడంతో కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్ చౌదరి వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించారు.

Munja Srinivas

ప్రభాత ఉదయం, కాగజ్‌నగర్‌: ఎండిపోతున్న పంటలకు వెంటనే సాగునీరు అందించాలని కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్ చౌదరి అన్నారు. శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ను రైతులు కలిసి సాగునీరు అందక వరి పంటలు ఎండుముఖం పడుతున్నాయని తమ గోడు చెప్పుకొన్నారు. వెంటనే స్పందించిన ఆయన రాత్రి వేళ భామనగండి చెరువు రైతుల పొలాల వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. పంటలను కాపాడేందుకు శనివారం నుంచే సాగునీరు విడుదల చేయాలని ఇరిగేషన్‌ శాఖ డీఈ, ఏఈలను ఆదేశించారు. రైతుల సమస్యపై చొరవ చూపిన సబ్‌ కలెక్టర్‌కు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ ఆనంద్‌కుమార్‌, రైతు సంఘం నాయకుడు మాదారపు శ్రీనివాసరావుతో పాటు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.