కల్వకుర్తి రైస్ మిల్లులో ధాన్యం కొరత 
తెలంగాణ

కల్వకుర్తి రైస్ మిల్లులో రూ.25 కోట్ల ధాన్యం మాయం: విజిలెన్స్ తనిఖీల్లో అక్రమాలు రట్టు

కల్వకుర్తిలోని సాయిలక్ష్మి వెంకటేశ్వర రైస్‌ మిల్లులో తనిఖీల సందర్భంగా 8,505 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరతను అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.25 కోట్లుగా అంచనా వేశారు.

Phaneendra

ప్రభాత ఉదయం, కల్వకుర్తి: ప్రజా పంపిణీ వ్యవస్థకు చేరాల్సిన ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. కల్వకుర్తిలోని ఓ రైస్‌ మిల్లులో తనిఖీలు నిర్వహించగా రూ.25 కోట్ల విలువైన 8,505.586 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు తేలింది. ఈ వ్యవహారంపై జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ దండు రాజేందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్వకుర్తి ఎస్‌ఐ కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని సాయిలక్ష్మి వెంకటేశ్వర పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లులో జిల్లా పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అందించాల్సిన ధాన్యంలో 8,505.586 మెట్రిక్‌ టన్నుల కొరత ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.25 కోట్లుగా అంచనా వేశారు. మిల్లు నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.