ప్రభాత ఉదయం, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీసులు 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ పోలీసులు శనివారం సాయంత్రం దుర్గాపురం స్టేజి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైవేపై ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో అనుమానాస్పదంగా వస్తున్న హోండా సిటీ కారును నిలిపి తనిఖీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి నుంచి బెంగళూరుకు కారులో 62 ప్యాకెట్ల గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. దాని విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. నిందితులను కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా హానూరుకు చెందిన సెల్వ సూర్య, కొల్లేగల్ ప్రాంతానికి చెందిన రాజా గౌండర్ మురుగన్‌గా గుర్తించారు.