Bhadradri Kothagudem District Command and Control Centre Inauguration 
తెలంగాణ

467 సీసీ కెమెరాలతో నిఘా.. చుంచుపల్లిలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం

జిల్లాలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఎస్పీ రోహిత్‌ రాజు సోమవారం ప్రారంభించారు.

M. Suresh

ప్రభాత ఉదయం, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఎస్పీ రోహిత్‌ రాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, సమర్థవంతమైన దర్యాప్తు కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 467 సీసీటీవీ కెమెరాలను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించినట్లు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.