హాలియాలోని లక్ష్మీనరసింహ గార్డెన్స్ వద్ద ఆహ్వానం లేకుండా వచ్చే అతిథులకు హెచ్చరికగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. 
తెలంగాణ

పిలవని పేరంటానికి వస్తే జైలే! ఫంక్షన్‌ హాల్‌ ఎదుట హెచ్చరిక ఫ్లెక్సీ

నల్లగొండ జిల్లా హాలియాలో ఆహ్వానం లేకుండా విందులకు వచ్చే వారికి చెక్ పెట్టేందుకు ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

Phaneendra

ప్రభాత ఉదయం, నాగార్జునసాగర్ : పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఆహ్వానం లేకుండానే కొందరు హాజరవుతూ విందు భోజనాలు ఆరగిస్తున్నారు. దీనివల్ల నిర్వాహకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వారికి చెక్‌ పెట్టేందుకు నల్లగొండ జిల్లా హాలియాలోని లక్ష్మీనరసింహ గార్డెన్స్‌ నిర్వాహకుడు వినూత్న చర్యకు శ్రీకారం చుట్టారు. ‘పిలవని పేరంటానికి వస్తే జైలుపాలే’ అంటూ ఫంక్షన్‌ హాల్‌ ఎదుట ఓ హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫంక్షన్‌కు సంబంధం లేని వ్యక్తులు పట్టుబడితే బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 329(3) ప్రకారం మూడు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తారని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.