ప్రభాత ఉదయం, మహబూబ్‌నగర్ : కాంట్రాక్టర్ నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని యూత్ అండ్ స్పోర్ట్స్ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్ రూ. 3 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేశారు. వీటికి సంబంధించి బిల్లులు చేసేందుకు యూత్ అండ్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాజశేఖర్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఉమేశ్ కలిసి రూ. లక్ష డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వారి సూచనతో సదరు కాంట్రాక్టర్ గురువారం పాలమూరులోని ఓ హోటల్‌లో రాజేందర్ రెడ్డిని కలిసి డబ్బులు ఇచ్చారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు రాజేందర్ రెడ్డితో పాటు కంప్యూటర్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.