పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ 
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి జరుపుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ :  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవాలని పీసీసీ అధ్యక్షుడు బీ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. ఇది పేదలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే సందర్భం అని, వారి సొంతింటి కల నేరవేర్చిన ఆనందాన్ని పంచుకుంటూ కాంగ్రెస్ శ్రేణులు వారి ఇండ్లకు వెళ్లి దీపావళి పండుగను జరుపుకోవాలని సూచించారు.  గ్రామాల్లో రెండు దఫాలలో 7లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, హైదరాబాద్ నగరంలోనే ఒక లక్ష వరకు నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. సగానికి పైగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు సైతం జరిగాయని చెప్పారు. ఈ సందర్బంగా పేదల ఇండ్లకు వెళ్లి వారితో దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని మహేశ్ గౌడ్ కేడర్‌కు విజ్ఞప్తి చేశారు.