మెదక్ జిల్లా ఎనికెపల్లి శివారులో మొసలిని బంధించి తరలించిన రెస్క్యూ బృందం 
తెలంగాణ

పొలంలో మొసలి పట్టివేత

పాపన్నపేట మండలం ఎనికెపల్లి సమీపంలో మొసలి కనిపించడంతో గ్రామస్తులు అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. అధికారులు దానిని సురక్షితంగా పట్టుకున్నారు.

Ranjith

ప్రభాత ఉదయం, మెదక్:  మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఎనికెపల్లి శివారులోని భారీ మొసలి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్​ఆర్​ఓ హిమచందన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. మొసలిని బంధించేందుకు రెస్క్యూ టీంకు సమాచారం ఇచ్చారు. సంగారెడ్డి నుంచి వచ్చిన రెస్క్యూ టీం చాకచక్యంగా మొసలిని బంధించి వన్యాప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్​ఓ మాట్లాడుతూ.. మంజీరా నది తీరంలో నీటి మట్టం తగ్గడంతో మొసళ్లు ఇతర వన్యప్రాణులు వచ్చే అవకాశం ఉంటుందని వాటిని పట్టుకునేందుకు యత్నించకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ శారద, సిబ్బంది ఉన్నారు.