తెలంగాణ

అనివార్య కారణాల వల్లే రాలేకపోతున్నాం : పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు మంత్రి దామోదర, ఎమ్మెల్యే తోట సమాచారం

ప్రత్యేక పరిస్థితుల కారణంగా తాము సమావేశానికి హాజరుకా లేకపోతున్నామని పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్ గౌడ్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమాచారం అందించారు.

Phaneendra

 ప్రభాత ఉదయం, హైదరాబాద్ : కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల సమావేశానికి హాజరుకాలేక పోతున్నామని పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్‌కు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వేరువేరుగా సమాచారం అందించారు. గురువారం మంత్రివర్గ సమావేశం ఉండటంతో సమయం లభించలేదని, మరో తేదీని నిర్ణయించి తెలియచేస్తే వస్తానని మంత్రి తెలియజేశారు. అలాగే, ఎమ్మెల్యే తోట కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని తెలియజేశారు. ఢిల్లీలో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య వివాదం జరిగిన నేపథ్యంలో మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు గురువారం హాజరు కావాల్సిందిగా మహేశ్‌గౌడ్ వారిని కోరిన విషయం తెలిసిందే. ఈ సమాచారం మేరకు ఆయన మరో తేదీని ఖరారు చేసి తెలియచేయనున్నారు.