ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 
తెలంగాణ

గ్లోబల్ సమ్మిట్‌కు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ ముస్తాబు: మంత్రి వివేక్

భారత్ ఫ్యూచర్ సిటీలోని స్కిల్స్ యూనివర్సిటీలో జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్' ఏర్పాట్లను మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో త్వరలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌’ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం పరిశీలించారు. అభివృద్ధి, మౌలిక వసతుల పనుల వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.