ప్రభాత ఉదయం నిర్మల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీఎం పదవిని రెన్యూవల్ చేసుకునేందుకు ఢిల్లీకి మూటలు మోస్తున్నాడంటూ బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సర్‌పై ఇండియా కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్‌లో మహాపాదయాత్ర చేపట్టారు. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి నేడు రాహుల్‌గాంధీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, సునీల్ బన్సల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేపీ రాష్ర్ట సహ ఇన్చార్జి అభయ్ పాటిల్ తదితరులు పాల్గొనారు.