ప్రభాత ఉదయం, చేవెళ్ల : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మొయినాబాద్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని 15 మంది లబ్ధిదారులకు ఈ పథకాల కింద మంజూరైన రూ.15,00,250 విలువైన చెక్కులను గురువారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపిల్లల వివాహ ఖర్చులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.