తెలంగాణలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి  
తెలంగాణ

తెలంగాణ రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు: కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎంపీ చామల

తెలంగాణలో రహదారుల విస్తరణ, జాతీయ రహదారుల హోదా, గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Phaneendra

ప్రభాత ఉదయం, యాదాద్రి భువనగిరి : తెలంగాణలో మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి మంగళవారం కలిసి రెండు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–జగదేవ్‌పూర్–భువనగిరి–చౌటుప్పల్ మార్గానికి, అలాగే చౌటుప్పల్–ఆమనగల్లు–షాద్‌నగర్–సంగారెడ్డి మార్గాలకు జాతీయ రహదారి హోదా కల్పించాలని కోరారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్​ను రీజినల్ రింగ్ రోడ్​తో అనుసంధానించేలా, మెట్రో కారిడార్ వెంబడి 10 గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి స్పందిస్తూ, జాతీయ రహదారుల ప్రకటనకు సంబంధించిన విధివిధానాలు ఖరారైన వెంటనే, తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల సాధన కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తామని ఎంపీ చామల పేర్కొన్నారు.