Nagarjuna Sagar Project Inspection By Irrigation EIC Madhusudan Rao 
తెలంగాణ

సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన ఈఎన్‌సీ

నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ మధుసూదన్‌రావు పరిశీలించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Madhu

ప్రభాత ఉదయం, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టును బుధవారం తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్, క్యాడ్ వో అండ్ ఎం ఇంజినీర్ ఇన్ చీఫ్ మధుసూదన్‌రావు సందర్శించారు. ప్రాజెక్టు గ్యాలరీస్, వాక్ వే బ్రిడ్జి, స్పిల్ వే, ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరైన నిధులతో భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులు, ప్రాజెక్టు నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులతో చర్చించామన్నారు. ప్రాజెక్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలను పంపించాలని, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఆయనతోపాటు వో అండ్ ఎమ్ ఎస్ఈ మురళీధర్, ఈఈ శ్రీకాంత్, సాగర్ డ్యామ్ ఎస్ఈ ఇంజినీర్ మల్లికార్జునరావు, డ్యామ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.