Nagarjuna Sagar Dam 
తెలంగాణ

‘సాగర్’ @540 అడుగులు

నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 540 అడుగులకు చేరింది. వివిధ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తుండగా, జలవిద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది.

Saidi Reddy

ప్రభాత ఉదయం, ప్రభాత ఉదయం: నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ఆదివారం సాయంత్రం 540 అడుగుల వద్ద నిల్వ ఉన్నది.  శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 14,848 క్యూసెక్కుల నీరు వస్తుండగా, సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువ ద్వారా 6,634 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 2,000 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగ డిమాండ్‌ను బట్టి  జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం తిరిగి జలాశయంలోకి 5,191 క్యూసెక్కులను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 188.34 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు.