ఎమ్మెల్యే వేముల వీరేశం కాన్వాయ్‌కు అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం  
తెలంగాణ

ఎమ్మెల్యే వేములకు తృటిలో తప్పిన ప్రమాదం!

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అన్నారం వద్ద ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టింది. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు.

Phaneendra

ప్రభాత ఉదయం, నకిరేకల్ : ఎమ్మెల్యే వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని అన్నారం వద్ద చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న తన వాహనాన్ని మరొక కారు ఢీకొట్టింది. ఎయిర్‌బ్యాగ్‌లు తెరచుకోవడంతో పాటు భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఎమ్మెల్యే క్షేమంగా బయటపడ్డారు. వీరేశంను వెంటనే మరో కారులో పంపించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.