Officials conduct inspections regarding the diversion of water to KCR farmhouse  
తెలంగాణ

ఎర్రవల్లిలో నీటి తరలింపుపై ఆరా

పాండురంగ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ ఫాం హౌస్‌కు నీటిని తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

Ranjith

ప్రభాత ఉదయం, సిద్దిపేట ప్రతినిధి: పాండురంగ రిజర్వాయర్ నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫాం హౌస్‌కు నీటిని తరలిస్తున్నారంటూ ఆరోపణల నేపథ్యంలో గురువారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. మర్కూక్‌ మండలం ఎర్రవల్లి గ్రామంలోని పాండురంగ రిజర్వాయర్ పరిసరాల్లో హార్టికల్చర్, ఇరిగేషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు. జోన్ల వారీగా బోరు మోటార్లు, పైపుల ద్వారా పంప్ హౌస్‌లకు వెళ్తున్న నీటిని పరిశీలించారు. గ్రామానికి మంజూరైన డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలు తీరును లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం హార్టికల్చర్ డీడీ సువర్ణ మాట్లాడుతూ.. డ్రిప్ ఇరిగేషన్ అమలుతీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు  వచ్చామన్నారు.