ప్రభాత ఉదయం, హైదరాబాద్ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు జెన్ కో, బీహెచ్ఈల్ అధికారులు రంగంలోకి దిగారు. గత నెలలో ఈ సంస్థల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో 600 సమస్యలను గుర్తించారు. వీటిలో ప్రధానమైన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నారు. ఈ క్రమంలోనే బీహెచ్ఈఎల్ బృందం, సబ్ వెండర్ల ప్రతినిధులు, టీజీ జెన్ కో సీఎండీ హరీశ్ యాదాద్రి ప్లాంట్‌లో పరిస్థితిని బుధవారం సమీక్షించారు. బీహెచ్ఈఎల్ డైరెక్టర్(పవర్) తజీందర్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు, సబ్ వెండర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌కు సంబంధించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లోని వ్యాగన్ టిప్లర్లు, క్రషర్ హౌస్‌ను పరిశీలించారు. సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.