Patna High Court Judge Shashi Bhushan Prasad Singh visit Buddhavanam At Nagarjuna Sagar 
తెలంగాణ

బుద్ధవనం ప్రశాంతతకు నిలయం : జస్టిస్‌ శశిభూషణ్‌

నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శశిభూషణ్ ప్రసాద్‌సింగ్ దంపతులు సందర్శించారు.

Ranjith

ప్రభాత ఉదయం, నందికొండ: బుద్ధవనం ప్రశాంతతకు నిలయమని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శశిభూషణ్‌ ప్రసాద్‌సింగ్‌ అన్నారు. గురువారం శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వెళ్తూ ఆయన విజయ విహార్‌ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. ప్రొటోకాల్‌ ఆఫీసర్‌ దండా శ్రీనివాస్‌రెడ్డి, నిడమనూరు కోర్టు సూపరింటెండెంట్‌ తిరుమలేశులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్‌ శశిభూషణ్‌ ప్రసాద్‌సింగ్‌ సతీసమేతంగా నాగార్జునసాగర్‌ ప్రధాన డ్యామ్‌, బుద్ధవనాన్ని సందర్శించారు. మహాస్తూపంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను వివరించే లఘుచిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర న్యాయమూర్తి దంపతులను బుద్ధవనం కండువాలు, బ్రోచర్లతో సత్కరించారు. స్థానిక ఏఎస్సై గురునాథం, నిడమనూరు కోర్టు సిబ్బంది ఖాలిక్‌ తదితరులు వెంట ఉన్నారు.