Heavy Winds Cause Dongargaon houses collapse 
తెలంగాణ

ఇంద్రవెల్లిలో గాలివాన బీభత్సం

కూలిన మూడు రేకుల ఇండ్లు

Sai kiran

ప్రభాత ఉదయం, ఉట్నూర్ : ఇంద్రవెల్లి మండలంలో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో డోంగర్‌గావ్‌లో మూడు రేకుల ఇండ్లు కుప్పకూలాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కొన్ని ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో నిత్యవసరాలతో పాటు సామాన్లు తడిచిపోయాయి. ఈదురుగాలులకు పత్తి, వరి నేలకు ఒరిగాయి. ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.