TIDES Free Driving Training Programme In Rajanna Siricilla 
తెలంగాణ

దసరా ఆఫర్!

దసరా సెలవుల సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లా బద్దెనపల్లిలోని టైడ్స్‌లో వివిధ వాహనాల డ్రైవర్లకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు.

Srinivas Rao

ప్రభాత ఉదయం, రాజన్నసిరిసిల్ల: దసరా పండుగ సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ శివారులోని టైడ్స్ (తెలంగాణ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ డ్రైవింగ్​ ఎడ్యుకేషన్​ అండ్​ స్కిల్స్)లో డ్రైవర్లకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. దసరా హాలిడేస్​ సందర్బంగా వారం రోజులుగా ఈఐబీ(ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్ బస్) డ్రైవర్లు, ఎక్సోప్లోజివ్​ ట్యాంకర్​ డ్రైవర్లు,పెట్రోల్, డీజిల్​ ట్యాంకర్​ డ్రైవర్లు, డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో పట్టుబడి లైసెన్స్ సస్పెండ్​ అయిన డ్రైవర్లు, యాక్సిడెంట్​లో లైసెన్స్​ సస్పెండ్​ అయిన డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. డ్రైవింగ్​ మెళకువలతో పాటు లైసెన్స్​ పునురుద్ధరిస్తున్నారు. వివిధ వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురైన డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. యాదాద్రి భవనగిరి జిల్లా నుంచి ఇప్పటికే 203 మందికి ట్రైనింగ్​ పూర్తయింది. మరో 747 మందికి ప్రస్తుతం ట్రైనింగ్​ నడుస్తోంది. స్కూళ్లకు సెలవులు ఉండడంతో స్కూల్​ బస్​ డ్రైవర్లుకు సైతం ఉచితంగా డ్రైవింగ్​లో శిక్షణ ఇస్తున్నారు.