తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం : రామ్ మాధవ్

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ది ఐరన్ లెగ్ అని, కాంగ్రెస్ దయనీయ స్థితిలో ఉందని విమర్శించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ :  రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్‌మాధవ్ దీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు. ఇక్కడి ప్రధాన ప్రతిపక్ష నేత ‘ఐరన్ లెగ్’గా మారారని కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గతంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ ఆయన కలిసిన వారంతా ఓటమి చవిచూశారన్నారు.   రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన సభ విఫలమైనందుకు సొంత నేతలను సస్పెండ్ చేసుకునే దయనీయ స్థితికి కాంగ్రెస్ చేరిందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌, నిర్మల్లో తాము నిర్వహించిన పాదయాత్రలకు వేలాదిగా ప్రజలు తరలివచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.