సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించిన సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు 
తెలంగాణ

సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం

పుట్టపర్తిలో ఈ నెల 23న నిర్వహించనున్న సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు హాజరు కావాలని సీఎం రేవంత్‌రెడ్డిని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు ఆహ్వానించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : సత్యసాయిబాబా శత జయంత్యుత్సవాలకు హాజరు కావాలని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ నెల 23న పుట్టపర్తిలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎంను కోరారు. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఎస్‌జీ చలం తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.