Illegal Soil Excavation From Bhima Canal For Bharatmala NH 167 highway expansion 
తెలంగాణ

‘మట్టి’కొట్టుకుపోతున్నారు!

సంగంబండ భీమా కాలువ వద్ద ప్రాజెక్టు అవసరాల కోసం నిల్వ చేసిన మట్టిని తరలించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Saidi Reddy

ప్రభాత ఉదయం, మక్తల్:  నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ భీమా కాలువ ఫేజ్-2 దగ్గర నిల్వ ఉంచిన మట్టిని భారత్​మాల–167 హైవే విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఎలాంటి అనుమతి లేకుండానే తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు అవసరాల కోసం నిల్వ ఉంచిన మట్టిని తరలించాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతి తప్పనిసరి. కానీ, వారికి తెలియకుండానే మట్టిని తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు తమ అవసరాల కోసం మట్టిని తరలిస్తే వెంటనే కేసులు నమోదు చేసే అధికారులు, కాంట్రాక్టర్​పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.