సింగరేణి కార్మికులను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు 
తెలంగాణ

సింగరేణి ట్రైనీలకు గుడ్‌న్యూస్ : 1,135 మందిని జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు

సింగరేణిలో అర్హత కలిగిన బదిలీ వర్కర్లు, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలను క్రమబద్ధీకరించేందుకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

Phaneendra

ప్రభాత ఉదయం, రామగుండం : సింగరేణిలో బదిలీ వర్కర్, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత గల వారందరినీ జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరించనున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 డిసెంబర్ 31 కన్నా ముందు ఉద్యోగంలో చేరి, ఏ క్యాలెండర్ సంవత్సరంలోనైనా భూగర్భ విభాగంలో 190 రోజులు, ఓపెన్ కాస్ట్, ఇతర విభాగాల్లో 240 రోజులు పనిచేసిన వారిని అర్హులుగా ప్రకటించింది. ఈ నెల 23లోగా అర్హుల జాబితాను అందజేయాలని ఏరియా జీఎంలను ఆదేశించింది. ఈ మేరకు రెండు, మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న సుమారు 1,135 మంది కార్మికులు జనరల్ అసిస్టెంట్లుగా నియామకం కానున్నారు.