డిస్మిస్డ్ ఉద్యోగులకు తిరిగి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం. 
తెలంగాణ

సింగరేణిలో డిస్మిస్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..మళ్లీ ఉద్యోగం కోసం అప్లయ్ చేసుకునే అవకాశం

విధులకు గైర్హాజరై డిస్మిస్ అయిన ఉద్యోగులకు తిరిగి అవకాశం కల్పిస్తూ సింగరేణి మేనేజ్‌మెంట్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ ​: విధులకు డుమ్మా కొట్టడం వల్ల డిస్మిస్​ అయిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు సింగరేణి మేనేజ్​మెంట్​ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కోల్​బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిస్మిస్డ్ ఉద్యోగులకు తిరిగి అవకాశం కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరడంతో ఈ అంశాన్ని పరిశీలించాలని మేనేజ్​మెంట్​ను ఆయన ఆదేశించారు. 2023 నుంచి 2025 మధ్యకాలంలో గైర్హాజరైన వారికి ఉద్యోగం ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తూ మేనేజ్​మెంట్​ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 46 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సున్నవారు అప్లయ్​ చేసుకోవాలని సూచించింది. దీంతోపాటు విధుల నుంచి తొలగించడానికి ముందు ఐదేండ్లలో కనీసం రెండేండ్లలో 100 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి. జనరల్ అసిస్టెంట్ ట్రైనీ, కేటగిరి-1 పోస్టులకు వైద్యపరంగా ఫిట్​గా ఉండాలి. అర్హత కలిగిన డిస్మిస్డ్ ఉద్యోగులు దరఖాస్తును పూర్తి చేసి వారు చివరగా పనిచేసిన హెచ్​వోడీకి ఈ నెల 14 లోపు అందించాలని మేనేజ్​మెంట్​ ఉత్తర్వుల్లో పేర్కొంది.