సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా డ్యాంలోకి నీటి విడుదల. 
తెలంగాణ

మంజీరా డ్యాంలోకి సింగూర్ నీటి విడుదల

సంగారెడ్డి ప్రజల తాగునీటి అవసరాల కోసం సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా డ్యాంలోకి 0.15 టీఎంసీల నీటిని విడుదల చేశారు.

Phaneendra

ప్రభాత ఉదయం, అందోల్ ​: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా డ్యాంలోకి నీటిని విడుదల చేశారు. శనివారం సంగారెడ్డి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోని 4,5,6  నంబర్​ గేట్లను ఒక మీటరు మేర ఎత్తి 0.15 టీఎంసీల నీటిని మంజీరా డ్యాంలోకి వదిలారు. సింగూర్​ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.289 టీఎంసీల నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ ఏఈ నవీన్ తెలిపారు. నీటి విడుదల నేపథ్యంలో మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గొర్ల  కాపరులు, మత్స్యకారులు నది లోనికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.