Performing Midnight rituals in Garlapadu for hidden treasure 
తెలంగాణ

గార్లపాడులో అర్ధరాత్రి కలకలం

Madhu
  • గుప్తనిధుల కోసం అపరిచితుల పూజలు

  • పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు

ప్రభాత ఉదయం, అల్లంపూర్: రాజోలి మండలం తూర్పు గార్లపాడులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూజలు నిర్వహించడంతో స్థానికంగా కలకలం రేగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి కొందరు అపరిచిత వ్యక్తులు కారులో ఆలయ సమీపానికి చేరుకున్నారు. అనంతరం గుప్తనిధుల కోసం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే రాజోలి పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూజలు జరిగిన ఆనవాళ్లను, ఆధారాలను సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.