Telangana Govt Announces ₹6 Lakh Relief For Ukraine War Victim’s Family 
తెలంగాణ

సుదర్శన్‌ కుటుంబానికి రూ.6 లక్షల సాయం

హుస్నాబాద్‌కు చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

Madhu

ప్రభాత ఉదయం, జగిత్యాల: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా రూరల్ మండలం హుస్నాబాద్‌కు చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్‌.. క్షిపణులు, డ్రోన్‌ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. సుదర్శన్‌ భార్య విజ్ఞప్తి మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఈ విషయాన్ని సోమవారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి ఆర్థికసాయం అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. సుదర్శన్‌ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.