ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్ర పోలీసుశాఖలో 1,435 మంది సిబ్బంది పదోన్నతి కోసం ముందస్తు శిక్షణను ప్రారంభించారు. రాష్ట్రంలోని మూడు పోలీసు శిక్షణ కళాశాలల్లో (పీటీసీ) సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగాలకు చెందిన సిబ్బందికి సోమవారం నుంచి ఈ శిక్షణ ప్రారంభించినట్టు డీజీపీ కార్యాలయం వెల్లడించింది. వీరిలో 899 మంది సివిల్, 536 మంది ఏఆర్ విభాగానికి చెందినవారు ఉన్నారు. మేడ్చల్ పీటీసీలో సివిల్ విభాగానికి చెందిన 586 మంది కానిస్టేబుళ్లకు అదనపు డీజీపీ అకున్ సబర్వాల్, కరీంనగర్ పీటీసీలో సీపీ గౌశ్ అలం ఆధ్వర్యంలో 313 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, ఎస్‌ఐలకు శిక్షణను ప్రారంభించారు. అలాగే, వరంగల్ పీటీసీలో సీపీ శ్వేత ఆధ్వర్యంలో 302 మంది కానిస్టేబుళ్లకు, 176 మంది హెడ్ కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభించారు. కరీంనగర్ పీటీసీలో మరో 58 మంది ఏఆర్ ఎస్‌ఐలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.