For Mulugu Power Lines Realignment Telangana Govt Sanctions Rs 3 Crore 
తెలంగాణ

ములుగులో విద్యుత్తు లైన్ల మార్పు, విస్తరణకు రూ.3 కోట్లు

ములుగు నియోజకవర్గంలో నివాస గృహాల మీదుగా వెళ్తున్న విద్యుత్తు లైన్ల మార్పు, విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది.

M. Suresh

ప్రభాత ఉదయం, ములుగు జిల్లా ప్రతినిధి: ములుగు నియోజకవర్గంలో నివాస గృహాల మీదుగా వెళ్తున్న విద్యుత్తు లైన్ల మార్పు, విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగులో నివాస గృహాల మీదుగా వెళ్తున్న విద్యుత్తు లైన్ల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్తు లైన్ల మార్పునకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు ఆమోదం తెలిపారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి సీతక్కకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.