Three Family Members Dead In Manur Pond Accident 
తెలంగాణ

చెరువుకుంటలో పడి ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లా మనూరు శివారులోని చెరువుకుంటలో పడి ముగ్గురు మృతి చెందారు. నీటిలో జారిపడిన వ్యక్తిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరూ మునిగిపోయారు.

Sai kiran

ప్రభాత ఉదయం, సంగారెడ్డి జిల్లా:  సంగారెడ్డి జిల్లా మనూరు గ్రామ శివారులోని చెరువుకుంటలో పడి ముగ్గురు మృతి చెందారు. శుక్రవారం అదే గ్రామానికి చెందిన సంగారెడ్డి, నరసింహారెడ్డి, కృష్ణవేణి బట్టలు ఉతికేందుకు చెరువుకుంట వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో సంగారెడ్డి నీటిలో కాలుజారీ పడిపోగా, రక్షించేందుకు వెళ్లిన నరసింహారెడ్డి, కృష్ణవేణి సైతం మునిగి మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రి తరలించారు.