తెలంగాణ

‘కోహాన్స్’కు పీసీబీ షాక్..మూసివేతకు ఆదేశాలు

సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో కొనసాగుతున్న కోహాన్స్​ ఫార్మా కంపెనీ (గతంలో సువెన్​ ఫార్మాస్యూటికల్స్​)ను మూసివేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి గురువారం ఆదేశాలు జారీ చేసింది.

Phaneendra

ప్రభాత ఉదయం, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో కొనసాగుతున్న కోహాన్స్​ ఫార్మా కంపెనీ (గతంలో సువెన్​ ఫార్మాస్యూటికల్స్​)ను మూసివేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి గురువారం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్​ 28న కంపెనీలోని ప్రొడక్షన్​ బ్లాక్​ నంబర్​–2లో క్లోరోఫాం లీకేజీ ఘటన చేటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ ఉద్యోగి అక్టోబర్​ 31న మృతి చెందారు. భద్రతా ప్రమాణాల ఉల్లంఘన, స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో పరిశ్రమ మూసివేతతో పాటు, కంపెనీకి విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసేందుకు పీసీబీ చర్యలు చేపట్టింది.