Vehicles with expired PUC certificates are likely to face a fine of Rs 1000 enforced through ANPR cameras 
తెలంగాణ

పొల్యూషన్ చెక్.. ఆటోమెటిక్ ఫైన్

Praveen

హైదరాబాద్ కమీషనరేట్లు పొల్యూషన్ కు చెక్ పెట్టే పనిలో పడ్డాయి. ఆటోమెటిక్ గా పొల్యూషన్ చెక్ చేసి చలాన్లు వేసే వ్యవస్థను ఏర్పాటుచేస్తుంది. క్యూర్ పరిధిలో వాహనాల నుంచి వెలువడే పొల్యూషన్ ను నియంత్రించడానికి సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాయి. దీంట్లో భాగంగా రాష్ర్టంలోని 516 PUC (పొల్యూషన్ అండర్ కంట్రోల్) లను కేంద్ర సర్వర్ లకు అనుసంధానం చేశారు. క్యూర్ పరిధిలో 13 చోట్ల నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. బొల్లారం, జీడిమెట్ల లో 8 లోకాస్ట్ సెన్సార్లు ఏర్పాటుచేశారు.

పి.యూ.సి గడువు ముగిస్తే చలాన్లు తప్పవు

మీ వాహనం పి.యూ.సి. గడువు ముగిస్తే చలాన్లు తప్పేలా లేవు. ఆటోమెటిక్ గా పొల్యూషన్ చెక్ చేయడానికి ANPR ( ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) కెమెరాల ద్వారా చలాన్లు వేయనుంది. కొత్త వాహనాలకు ఒక సంవత్సరం వరకు పి.యూ.సి. గడువు ఉండగా... పాత వాహనలకు అంటే ఖరీదు చేసి ఏడాది దాటిన వాహనాలకు ఆరు నెలలు పి.యూ.సి. సర్టిఫికెట్ వ్యాల్యూ ఉంటుంది. సమయం మించకముందే పి.యూ.సి. కేంద్రాల్లో పొల్యూషన్ చెక్ చేయించకుంటే రూ. 1000 చలాన్ తప్పదు.