ప్రభాత ఉదయం, వికారాబాద్: అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్‌తివారీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు వాటిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి దరఖాస్తుపై వివరాలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. పండుగపూట అర్జీలు సమర్పించేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.