ప్రభాత ఉదయం, తాండూరు: వికారాబాద్ జిల్లాలోని కోట్‌పల్లి, జుంటుపల్లి జలాశయాల ఆధునీకరణకు రూ.95.21 కోట్ల నిధులు మంజూరు అయినట్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.5.71 కోట్లతో చేపట్టే జుంటుపల్లి ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. 60 దశాబ్దాలుగా ఏ నాయకులూ పట్టించుకోని కోట్‌పల్లి ప్రాజెక్టుకు రూ 89.5 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామన్నారు. చివరి ఆయకట్టుకు సైతం నీటిని అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్, నాయకులు పాల్గొన్నారు.