హైదరాబాద్ సచివాలయం ఎదుట వొకేషనల్ ట్రైనర్లు ధర్నా 
తెలంగాణ

ఎనిమిది నెలలుగా జీతాల్లేవు ..సెక్రటేరియట్ ఎదుట ఒకేషనల్ ట్రైనర్ల ధర్నా

ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సచివాలయం ఎదుట వొకేషనల్ ట్రైనర్లు మెరుపు ధర్నా చేశారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని విద్యాశాఖ హామీ ఇచ్చింది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఎనిమిది నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సచివాలయం ఎదుట ఒకేషనల్ ట్రైనర్లు మెరుపు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్, కేజీబీవీలు, గురుకులాల్లోని సమగ్రశిక్షా పరిధిలో సుమారు 1,900 మంది వొకేషనల్ ట్రైనర్లు పనిచేస్తున్నారు. 13 ఏజెన్సీలో పరిధిలో ట్రైనర్లు పనిచేస్తుండగా వీరిలో 12 ఏజెన్సీలకు చెందిన 1,400 మందికి వేతనాలు ఇవ్వడం లేదు. ట్రైనర్లు మొదట డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్, విద్యాశాఖ కార్యదర్శిని కలిసి సమస్యలను వివరించారు. కాగా ఒకేషనల్ ట్రైనర్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ తెలిపారు.