ప్రభాత ఉదయం, మక్తల్: వాటర్ బాటిల్ మూత ఓ పసివాడి ఉసురు తీసింది. ఈ విషాద ఘటన మక్తల్ నియోజకవర్గం, ఊట్కూర్ మండల కేంద్రంలోని దేవీనగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దేవీనగర్ కాలనీకి చెందిన లక్ష్మణ్, గాయత్రి దంపతుల తొమ్మిది నెలల కుమారుడు ఆర్యవర్ధన్ ఇంట్లో ఆడుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్‌ను నోట్లో పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో బాటిల్ మూత ఊడి గొంతులో ఇరుక్కుపోయింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు మూతను బయటకు తీశారు. అయినా చిన్నారి అస్వస్థతకు గురికావడంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తొమ్మిది నెలల బిడ్డ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.