ప్రభాత ఉదయం, సిద్దిపేట : మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల్లో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రీ-సర్వే ప్రక్రియ పూర్తయింది. డివిజనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బానోతు సేవియానాయక్, వంశీ ఆధ్వర్యంలో ఆరుగురు చొప్పున రెండు బృందాలుగా ఏర్పడి అధికారులు సర్వే నిర్వహించారు. ఎర్రవల్లి గ్రామానికి సంబంధించి 14.5 కిలోమీటర్లు, శివారు వెంకటాపూర్ గ్రామానికి సంబంధించి 12 కిలోమీటర్ల మేర సరిహద్దుల రీ-సర్వేను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ రెండు గ్రామాల్లో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒక రోజు ముందుగానే రైతులకు సమాచారం అందించి, వారి సమక్షంలో సర్వే చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.