పులివెందులలో కక్షలకు చంద్రబాబు ఆజ్యం : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

పులివెందుల ఎన్నికల ప్రక్రియను పూర్తి వెబ్‌కాస్టింగ్, లైవ్ ఫుటేజ్‌తో నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు అవినాశ్ రెడ్డి తెలిపారు.
YSRCP MP YS Avinash Reddy
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, అమరావతి : పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా జరుగకుండా కూటమి నేతలు భారీ స్కెచ్‌ వేశారని, డీఐజీ కోయ ప్రవీణ్‌ కనుసన్నల్లో అరాచకాలు జరుగుతున్నాయని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్​రెడ్డి ఆరోపించారు. పులివెందుల వైఎస్​ఆర్​సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు, టీడీపీ నేత బీటెక్‌ రవి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తమ స్వార్థ రాజకీయాల కోసం మళ్లీ కక్షలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కార్యకర్తలు, అభ్యర్థులపై దాడులు చేసి వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియను పూర్తి వెబ్‌ కాస్టింగ్, లైవ్‌ ఫుటేజ్‌ ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు ఆయన తెలిపారు. పులివెందుల అభివృద్ధి, రైతుల సంక్షేమం విషయంలో వైఎస్​ఆర్​, జగన్‌ చేసిన కృషిని ప్రజలు గుర్తు చేసుకొని ఓటు వేయాలని అవినాశ్​రెడ్డి కోరారు.