‘అమరావతి’ పనులపై చంద్రబాబు సమీక్ష

Amaravati Construction work reviews by chandrababu
Amaravati capital construction works review by chandrababu
Published on: 

విజయవాడ: అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల స్థితిగతులు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం అమరావతిలో 152 ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో సుమారు 41 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు సీఎంకు వివరించారు. గత నెలలో రూ.1,345 కోట్ల విలువైన నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు సమీక్షలో వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిలో ప్రస్తుతం కొనసాగుతున్న 152 ప్రాజెక్టుల పనులను వివిధ నిర్మాణ సంస్థలు, ఏజెన్సీలు చేపడుతున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమీక్షలో పురపాలకశాఖ మంత్రి పీ నారాయణ, రాజధాని నిర్మాణ పనులు చేపడుతున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు.