

ప్రభాత ఉదయం, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక పోరులో చిత్తూరు జిల్లా గుడిపాల నుంచి తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమతశ్రీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. మండల స్థాయి ఎన్నికల బరిలో నిలిచిన ఆమె సమర్పించిన అఫిడవిట్లో ఆమె కుటుంబ సభ్యుల పేరిట మొత్తం రూ.172.27 కోట్ల ఆస్తి ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.9.28 కోట్లు చరాస్తి కాగా రూ.162.99 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో మమతశ్రీ పేరిట 2 స్కూటీలు, 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి, రూ.43.64 కోట్ల విలువైన స్థిరాస్తులుండగా, ఆమె భర్త ఈశ్వరనాయుడికి రూ.119.80 కోట్ల స్థిరాస్తులు 44.62 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.24.89 కోట్ల విలువైన ఇళ్లు, మూడు సరకు రవాణా వాహనాలు, మరో మూడు కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులు ఉన్నాయి. అదే విధంగా భార్యాభర్తల పేరిట రూ.32 కోట్ల రుణం ఉన్నట్లు వెల్లడించారు.