గూగుల్ షేర్లు భారీ పతనం

అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తూ టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్లు అమాంతం క్షీణించాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 11 శాతం వరకు పడిపోయాయి.
​Shares of Alphabet, Google's parent company, plunged more than 10%
Google loses billions: What’s behind Alphabet’s stock crash?
Published on: 

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తూ టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్లు అమాంతం క్షీణించాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 11 శాతం వరకు పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువలో ఈ మొత్తం నష్టం భారత కరెన్సీలో దాదాపు రూ. 33,875 లక్షల కోట్లుగా ఉంది. ఏఐ సేవలకు విశేష డిమాండ్ లభిస్తున్నప్పటికీ పెట్టుబడుల నష్టాలు, పెరిగిన ఖర్చులు మదుపర్లకు నిరాశ కలిగించాయి. త్రైమాసిక ఫలితాలు నిపుణుల అంచనాలను అందుకోలేకపోవడంతో అమెరికా మార్కెట్లలో ఆల్ఫాబెట్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది.

క్లౌడ్ విభాగం ఆదాయం

మూడో త్రైమాసికంలో గూగుల్ క్లౌడ్ విభాగం నుంచి వచ్చిన ఆదాయం 30.7 బిలియన్ డాలర్లకు చేరింది. సెర్చ్, యూట్యూబ్ విభాగాల ఆదాయ వృద్ధి మందగించినా క్లౌడ్ ఆదాయం కొంతవరకు సర్దుబాటు చేసింది. అయినప్పటికీ ఈ ఆర్థిక ఫలితాలు పెట్టుబడిదారులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాయి.