భారత్‌కు జర్మనీ పెట్టుబడులు

మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా భారత్‌లో పరిశ్రమలు విస్తరించనున్న నౌఫ్.
German company Knauf to invest in India
Germany's Knauf To Invest Rs 3,720 Crore In India
Published on: 

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ గృహ నిర్మాణ సామాగ్రి సంస్థ ‘నౌఫ్’ భారత్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. దేశంలో తమ పరిశ్రమ విస్తరణ గురించి రూ. 3,720 కోట్లు వెచ్చించనున్నామని ఆ సంస్థ ప్రకటించింది. ‘‘భారతదేశ ఆర్థిక వృద్ధి తీరు, ప్రభుత్వ విధానాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. భారత్‌లో ఇప్పటికే మాకు 2 ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పుడు మరో 4 ప్లాంట్లు నిర్మించాలని అనుకుంటున్నాం’’ అని నౌఫ్ ప్రపంచ జనరల్ పార్ట్‌నర్ మురత్ అక్యిల్దిజ్ తెలిపారు.

స్పష్టమైన విధానాలు

భారత్‌లో పరిశ్రమల స్థాపన గురించి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ నుంచి పూర్తి సహకారం లభిస్తుందని నమ్మకం వ్యక్తంచేశారు."భారత్ పట్ల మాకు అపారమైన నమ్మకం ఉంది. ఇక్కడ స్థిరత్వం ఉంది..  పదేళ్లలో దేశంలో ఆర్థిక పరిస్థితి మెరుగైన దిశలో ఉంది " అని మురత్ అక్యిల్దిజ్ పేర్కొన్నారు.

 స్థానిక ఉత్పత్తికి ప్రోత్సాహం

దిగుమతులపై ఆధారపడకుండా స్థానికంగానే తయారీ చేపట్టాలని నౌఫ్ భావిస్తోంది. దేశ ప్రజల అవసరాలకు తగినట్లు ఇక్కడి కార్మికులతోనే వస్తువులు తయారు చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా అనేక ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.