నెదర్లాండ్స్‌లోని ఏకైక ఉక్కు కర్మాగారం మన 'టాటా'దే: పీయూష్ గోయల్

నెదర్లాండ్స్‌లో సుమారు 11,000 మందికి ఉపాధి కల్పిస్తున్న టాటా స్టీల్‌ ఐజ్ముడెన్ ప్లాంట్‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. భారత్‌–నెదర్లాండ్స్ వాణిజ్య బంధాలపైనా చర్చించారు.
Union Minister Piyush Goyal
Union Minister Piyush Goyal praised the Tata Steel IJmuiden plant in Netherlands, which provides employment to 11,000 people
Published on: 

ఐజ్ముడెన్ : నెదర్లాండ్స్ దేశంలో సుమారు 11,000 మందికి ఉపాధి కల్పిస్తున్న ఏకైక ఉక్కు కర్మాగారం భారత్‌కు చెందిన టాటా స్టీల్‌దేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆమ్‌స్టర్‌డ్యామ్ సమీపంలోని 'ఐజ్ముడెన్' ప్రాంతంలో ఉన్న ఈ భారీ ఉక్కు తయారీ కేంద్రం ఐరోపా ఖండంలోనే అత్యంత కీలకమైన పారిశ్రామిక స్థావరాలలో ಒకటని ఆయన కొనియాడారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ఆయన అక్కడ ఉన్న టాటా స్టీల్ ప్లాంట్‌ను ప్రస్తావిస్తూ— "నేడు నెదర్లాండ్స్ దేశంలో మిగిలి ఉన్న ఒక్కగానొక్క స్టీల్ ప్లాంట్ మన టాటా సంస్థదే కావడం విశేషం" అని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పీయూష్ గోయల్ ప్రముఖ రోటర్‌డామ్ ఓడరేవును కూడా సందర్శించారు. అక్కడ పోర్ట్ అధికారులతో సమావేశమై రెండు దేశాల మధ్య రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో కొత్త భాగస్వామ్యాలు, వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు.