డార్క్ వెబ్‌లో ఎస్‌బీఐ ఖాతాదారుల డేటా లీక్‌

డార్క్ వెబ్‌లో 3,897 మంది ఎస్‌బీఐ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు లీకైనట్లు సమాచారం. అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ సూచించింది.
SBI Customer Data Leak On Dark Web
SBI informs 3,897 customers of dark web data leak, says funds are safe
Published on: 

న్యూఢిల్లీ: డార్క్ వెబ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు చెందిన వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. మొత్తం 3,897 మంది సమాచారం బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన బ్యాంకు అధికారులు ఖాతాదారులను అప్రమత్తం చేశారు. ఖాతాదారుల సొమ్ము సురక్షితంగానే ఉందని, అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ ప్రతినిధి సూచించారు.

ఖాతాదారులకు భరోసా

ఈ ఉదంతం 72 గంటల క్రితం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బాధితులకు వాట్సాప్, ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు పంపించారు. లీకైన సమాచారంలో కస్టమర్ల పేర్లు, పుట్టిన తేదీలు, లింగం, రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, ఇంటి చిరునామాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను ఉపయోగించి మోసగాళ్లు సంప్రదించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారులు సూచించారు. ఎవరైనా ఫోన్ చేసి అడిగినా ఓటీపీ, పాస్‌వర్డ్ వంటి రహస్య వివరాలను వెల్లడించవద్దని స్పష్టం చేశారు. డేటా లీక్ ఘటనపై ఎస్‌బీఐ పూర్తి స్థాయి విచారణ చేపట్టింది.