నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 22,700 దిగువకు నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలను చవి చూసినా, పలు షేర్లు మాత్రం లాభపడ్డాయి. మరికొన్ని షేర్లు మాత్రం యథాతథంగా కొనసాగాయి.
Indian Stock Market
Published on: 

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 460.30 పాయింట్లు (0.62 శాతం) క్షీణించి 73,249.39 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 123.70 పాయింట్లు (0.54 శాతం) నష్టపోయి 22,687.65 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ 22,700 స్థాయికి దిగువకు చేరింది. మొత్తం 4,148 షేర్లలో 1,323 లాభపడగా.. 2,670 నష్టాలను చవిచూశాయి. మరో 155 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

 లాభపడ్డ టాప్ కంపెనీలు

1.బజాజ్ ఫినాన్స్ – 1.74 %

2.సిప్లా – 1.29 %

3.అల్ట్రాటెక్ సిమెంట్ – 1 %

4.ఐసీఐసీఐ బ్యాంక్ – 0.97 %

5.బజాజ్ ఆటో – 0.82 %

 నష్టపోయిన టాప్ కంపెనీలు

6.నెస్ట్లే – 2.78 %

7.ఎటర్నల్ – 2.53 %

8.హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ – 2.09 %

9.టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ – 2.07 %

10.రిలయన్స్ ఇండస్ట్రీస్ – 2.03 %

 స్టాక్స్ పడిపోవడానికి కారణాలు

1.క్రూడాయిల్ ధరల పెరుగుదల (బ్యారెల్ ధర 3 శాతం పెరిగి 112.33 డాలర్ల వద్ద ట్రేడవ్వడం)

2.అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు (ఇరాన్, అమెరికా యుద్ధ పరిస్థితులు)

3.రూపాయి క్షీణత (డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు తగ్గి రూ. 94.82 వద్ద స్థిరపడడం)

 మళ్లీ తగ్గిన బంగారం ధర

పసిడి ధర గురువారం కూడా తగ్గింది. మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 0.8 శాతం క్షీణించి రూ.1,44,821కు చేరింది. వెండి ధర కూడా దిగొచ్చింది. కిలో వెండి ధర 2.7 శాతం తగ్గి రూ.2,03,506కు పడిపోయింది. దీంతో బంగారం, వెండి కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది.